schedule Friday, September 11, 2026

తల్లీ కూతుళ్ల మిస్సింగ్..!

calendar_today January 24, 2025
person dharshininews
తల్లీ కూతుళ్ల మిస్సింగ్..!
తల్లీ కూతుళ్ల మిస్సింగ్..! - ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం - కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వెళ్లిన ఓ తల్లీ కూతుళ్లు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన తాండూరు సబ్ డివిజన్ కరణ్‌ కోట్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం కేసు వివరాలను కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో శిరీషా(24) అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహము జరిగింది. వీరికి సంతానం కూడా ఉంది. అయితే ఈనెల 8వ తేదిన పాపతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లి.. తిరిగి ఇంటికి రాలేదు. అప్పటి నుంచి తెలిసిన వారి వద్ద, బందువుల వద్ద విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్త శ్రీనివాస్ కరణ్‌ కోట్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. తల్లీ కూతుళ్ల ఆచూకీ తెలిస్తే సెల్ : 8712670052కు సమాచారం అందించాలని ఎస్ఐ విఠల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32550/