schedule Friday, September 11, 2026

తాండూరు పోలీసులకు ఉత్తమ అవార్డులు..!

calendar_today January 26, 2025
person dharshininews
తాండూరు పోలీసులకు ఉత్తమ అవార్డులు..!
తాండూరు పోలీసులకు ఉత్తమ అవార్డులు..! - బెస్ట్ సీఐగా తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ - ఉత్తమ ఎస్ఐగా కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి - ఏఎస్ఐ, కానిస్టేబుళ్లకు ప్రశంస పత్రాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్లోని పోలీసులకు ఉత్తమ అవార్డులు వరించాయి. ప్రతి యేడాది గణతంత్ర దినోత్సవ వేడుకలలో అధికారులకు ఉత్తమ అవార్డులు అందించడం ఆనవాయితీ. ఈ మేరకు ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డులను అందజేశారు. పోలీసు శాఖ తరుపున తాండూరు సబ్ డివిజన్ లో ఉత్తమ సీఐగా తాండూరు పట్టణ సంతోష్ కుమార్, ఉత్తమ ఎస్ఐగా కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డిలు ఎంపికయ్యారు. అదేవిధంగా ఉత్తమ ఏఎస్ఐగా రాజేందర్(కరణ్ కోట్), ఉత్తమ ఏఆర్ఎస్ఐగా ఆనంద్ కుమార్ శెట్టి(తాండూరు టౌన్), ఉత్తమ పీసీలుగా రవికుమార్(పెద్దె ముల్), వీ.రవీందర్(యాలాల)లుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32566/