schedule Friday, September 11, 2026

హమాలీ కార్మికులకు తగిన గుర్తింపు

calendar_today January 26, 2025
person dharshininews
హమాలీ కార్మికులకు తగిన గుర్తింపు
హమాలీ కార్మికులకు తగిన గుర్తింపు - సంక్షేమ పథకాలలో ప్రాధాన్యమిస్తాం - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - మార్కెట్ కమిటిలో కార్మికులకు దుస్తుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటిలోని హమాలి కార్మికులకు తగిన గుర్తింపు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా వందనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చైర్మన్ బాల్ రెడ్డి, నేతలతో కలిసి గంజ్ లోని హమాలి కార్మికులకు కొత్త దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించి తీసుకవచ్చే ధాన్యాన్ని విక్రయించుకోవడంలో హమాలి కార్మికులు అందించే సేవలు కీలకమైనవి అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో కార్మికులకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఇండ్ల స్థలాలు కూడా ఇప్పించె ందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, నేతలు మురళీగౌడ్, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రాములు గౌడ్, నాయకులు, హమాలి కార్మిక సంఘం నేతలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32572/