schedule Friday, September 11, 2026

స్పెషల్ ఆఫీసర్ వచ్చేశారు..!

calendar_today January 27, 2025
person dharshininews
స్పెషల్ ఆఫీసర్ వచ్చేశారు..!
స్పెషల్ ఆఫీసర్ వచ్చేశారు..! - మున్సిపాల్టీల ప్రత్యేకధికారిగా సుధీర్‌ - బాధ్యతలు స్వీకరించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలకు స్పెషల్ ఆఫీసర్ వచ్చేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్ధలు) సుధీర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో సోమవారం జిల్లా కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కోడంగల్‌లోని మున్సిపాల్టీలకు సంబంధించి ఆయనకు ప్రత్యేకాధికారి బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రత్యేకాధికారి హోదాలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని మున్సిపాల్టీలతో పాటు తాండూరు, వికారాబాద్, పరిగి, కోడంగల్ మున్సిపల్‌లలో పాలకవర్గాల పదవికాలం ఆదివారంతో ముగిసింది. ఇప్పట్లో ఆయా మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించే పరిణామాలు కనిపించడం లేదు. మున్సిపాల్టీలకు పాలకవర్గాలు ఏర్పాటు అయ్యేంత వరకు ప్రత్యేక అధికారుల పాలన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పదవి కాలం పూర్తి అయిన మున్సిపాల్టీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32625/