schedule Monday, July 06, 2026

అభిషేక్ స్వామికి అభినందనల వెల్లువ..!

calendar_today January 28, 2025
person dharshininews
అభిషేక్ స్వామికి అభినందనల వెల్లువ..!
అభిషేక్ స్వామికి అభినందనల వెల్లువ..! - హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సన్మానం - అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి: బాడీ బిల్డింగ్ పోటీలో సత్తా చాటిన అభిషేక్ స్వామికి అభినందనల వెల్లువ కొనసాగుతుంది. మంగళవారం తాండూరు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాడీ బిల్డర్ అభిషేక్ స్వామిని సత్కరించారు. పాత తాండూరు కోటేశ్వర దేవాలయంలో సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో అభిషేక్ స్వామిని సన్మానించి.. శుభాకాంక్షలు తెలిపారు.   ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సౌత్ ఇండియాలో ప్రథమ స్థానంలో నిలిచిన అభిషేక్ స్వామిని యువత ఆదర్శంగా తీసుకోవాలి అని సూచించారు. చదువుతూనే ప్రతిభ చాటదడం అభినందనియమన్నారు. సెల్ ఫోన్, మత్తు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలు, నైపుణ్య రంగాల్లో సత్తా చాటాలన్నారు. అభిషేక్ స్వామి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎర్రం శ్రీధర్, పరామటి వెంకటేష్, పరియాదా రామకృష్ణ, కిరణ్ ముదిరాజ్, ఆశిష్, సందీప్ రెడ్డి, లోకేష్, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.   ఇది కూడా చదవండి... https://www.dharshininews.com/32641/