schedule Friday, September 11, 2026

ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గ రోడ్లకు మహర్ధశ

calendar_today January 28, 2025
person dharshininews
ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గ రోడ్లకు మహర్ధశ
ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గ రోడ్లకు మహర్ధశ - పీఆర్, ఆర్డీ రోడ్లకు రూ. 15 కోట్లు మంజూరు హర్షణీయం - కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషితో నియోజకవర్గంలోని పలు రోడ్లకు మోక్షం లభించిందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్ అన్నారు. నియోజకవర్గంలోని రోడ్లకు ఎమ్మెల్యే సహాకారంతో రూ. 15 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చాలా కాలంగా రోడ్ల అభివృద్ధికి ఎదురు చూస్తున్న గ్రామాల ప్రజల ఆశలు నెరవేరుతున్నాయన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మంచి విజన్‌తో దూసుకపోతున్నారని అన్నారు. ఆయనకు అన్ని విధాల సహాకారం అందిస్తామన్నారు. నిధులు మంజూరైన రోడ్లు ఇవే... తాండూరు మండలంలోని జినుగుర్తి- సంకిరెడ్డిపల్లి రోడ్డుకు రూ.1కోటి, సంకిరెడ్డిపల్లి దారునివాగు తాండాకు రూ.50లక్షలు, రాంపూర్ పీడబ్ల్యూడీ రోడ్డుకు రూ.41 లక్షలు, పీడబ్ల్యూడీ- బీజ్జారం రొ డ్డుకు రూ.61 లక్షలు, పీడబ్ల్యూడీ- గోనూర్ రోడ్డుకు రూ. 71 లక్షలు, పెద్దేముల్ మండలంలోని పెద్దేముల్- పెద్దేముల్ తాండా రోడ్డుకు రూ. 80లక్షలు, హన్మాపూర్ పీడబ్ల్యూడీ చౌరస్తా రోడ్డు- సంకిరెడ్డిపల్లి వయా జయరాం తాండా రోడ్డుకు రూ. 2 కోట్లు, పీడబ్ల్యూడీ ఖానాపూర్ రోడ్డుకు రూ.67 లక్షలు, బషీరాబాద్ మండలంలోని బషీరాబాద్ - కొల్లాపూర్ వయా దామర్ చెడ్ రోడ్డుకు రూ.3కోట్ల 25లక్షలు, మైల్వార్ - కంసాన్ పల్లి (బీ) రోడ్డుకు రూ. 50లక్షలు, పీడబ్ల్యూడీ - మంతన్ గౌడ్ రోడ్డుకు రూ. 58లక్షలు, యాలాల మండలంలోని యాలాల పీడబ్ల్యూడీ కమాల్ పూర్, వయా విశ్వనాథ్ పూర్ రోడ్డుకు రూ. 1కోటి 75లక్షలు, పీడబ్ల్యూడీ కమాల్ పూర్ రోడ్డుకు రూ. 21 లక్షలు, పీడబ్ల్యూడీ తిమ్మాయిపల్లి రోడ్డుకు రూ.32లక్షలు, పీడబ్ల్యూడీ- నాగసముందర్ రోడ్డుకు రూ.71లక్షలు మంజూరు కాగా కోట్ పల్లి అప్రోచ్ రోడ్డు ఇందోల్ రోడ్డుకు 35 లక్షలు మొత్తం రూ. 15 కోట్ల 20 లక్షలు మంజూరయ్యాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32651/