schedule Monday, July 06, 2026

మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..!

calendar_today January 29, 2025
person dharshininews
మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..!
మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..! - స్పెషల్ డ్రైవ్‌లో దొరికిపోయిన 23 మంది - ఎంవీ యాక్టు కింద కేసులు నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : ద్విచక్ర వాహనాలతో మైనర్లు చేస్తున్న దూకుడుకు తాండూరు పోలీసులు కళ్లెం వేస్తున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ మైనర్ల డ్రైవింగ్‌కు చెక్ పెడుతున్నారు. ఈనెల 9న నిర్వహించిన తనిఖీలలో 15 మంది మైనర్లపై, వానహనాల యజమానులపై కేసులు నమోదు చేయగా తాజాగా బుధవారం మరో 23 మందిపై కేసులు నమోదు చేశారు. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాలతో పాటు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచనల మేరకు బుథవారం పట్టణంలోని ప్రవైటు జూనియర్ కాలేజీలు, స్కూళ్ల వద్ద ఎస్ఐ రమేష్‌, పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 18 ఏండ్ల వయస్సు నిండలేని మైనర్లు బైకులు నడిపిస్తున్న 23 మందిని గుర్తించారు. వాహనాలను పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బైకులు నడిపిస్తున్న మైనర్లకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఎంవీ యాక్టు ప్రకారం మైనర్లు, వాహనాలను ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేశారు. మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32674/