schedule Friday, September 11, 2026

ఉత్తమ వైద్యుడుగా డా.జయప్రసాద్

calendar_today January 29, 2025
person dharshininews
ఉత్తమ వైద్యుడుగా డా.జయప్రసాద్
ఉత్తమ వైద్యుడుగా డా.జయప్రసాద్ - సన్మానించిన కార్పెంటర్ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతానికి చెందిన డా. జయప్రసాద్ ఉత్తమ వైద్యుడుగా అవార్డు పొందారు. తాండూరుకు చెందిన డా.జయప్రసాద్ మెదక్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడుగా పనిచేస్తున్నారు. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయనకు ఉత్తమ అవార్డును అందజేశారు. ఇందులో భాగంగా బుధవారం తాండూరు కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులు డా.జయప్రసాద్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. పేదల వైద్యుడుగా పేరుపొందిన డా.జయప్రసాద్ మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా డా. జయప్రసాద్ మాట్లాడుతూ పేదలకు తనవంతు సాయం అందిస్తూ వైద్య సేవలు అందించడం సంతృప్తిని కలిగిస్తుందన్నారు. ఈ సేవలను కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్ల సంగమేశ్వర్, సభ్యులు సత్యనారాయణ చారి, రాములు చారి, బ్రహ్మయ్య చారి, ఆంజనేయులు, నారాయణచారి, భీమేష్ చారి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32677/