schedule Monday, July 06, 2026

మత్తుతో జీవితాలు చిత్తు..!

calendar_today January 29, 2025
person dharshininews
మత్తుతో జీవితాలు చిత్తు..!
మత్తుతో జీవితాలు చిత్తు..! - చెడు అలవాలట్లకు దూరంగా ఉండాలి - తాండూరు ఎక్సైజ్ సీఐ బాలగంగాదర్ - వేధిక్ విశిష్ట స్కూల్ విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు అయిపోతాయని, వాటికి అందరు దూరంగా ఉండాలని తాండూరు ఎక్సైజ్ సీఐ బాలగంగాదర్ సూచించారు. బుధవారం ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ భాస్కర్ గౌడ్ ఆదేశాల మేరకు తాండూరు పట్టణం వేధిక్ విశిష్ట హైస్కూల్లో విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు.   ఈ సందర్భంగా సీఐ బాలగంగాదర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. వాటికి బానిసలు అయితే జీవితాలు నాశనమవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ నిజాముద్దీన్, సిబ్బంది కృష్ణ, రాజేందర్, భీమయ్య, రమేష్, మహేష్, కిషోర్, సతీష్, స్కూల్ కరస్పాండెంట్ సుహాస్, ప్రిన్సిపల్ నాగభూషణం, వైస్ ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్ మంజుల, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.     ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32680/