schedule Monday, July 06, 2026

ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి

calendar_today February 5, 2025
person dharshininews
ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి
ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి - లేదంటే పెనాల్టీ తప్పదు - తాండూరులో స్పెషల్ డ్రైవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపారులు ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరిగా పొందాలని, పొందిన వాటిని రెన్యువల్ చేసుకోవాలని తాండూరు మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. పట్టణంలో గత కొన్ని రోజుల నుంచి ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్, కొత్త లైసెన్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బుధవారం పట్టణంలోని పలు వ్యాపార సముదాయాలలో మున్సిపల్ సిబ్బంది ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు. వివిధ వ్యాపార యజనుమాలతో ట్రేడ్ లైసెన్సులపై అవగాహన కల్పించారు. వ్యాపారులు ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. లైసెన్సులు పొంది వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు. ఇదివరకు ఉన్న లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. లేదంటే రెన్యువల్ పెనాల్టీ పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ ప్రవీణ్, జవాన్లు అశోక్, శ్రీను తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32867/