schedule Friday, September 11, 2026

షిర్డీ సాయినాథుని సన్నిధిలో ప్రభాకర్ గౌడ్

calendar_today February 6, 2025
person dharshininews
షిర్డీ సాయినాథుని సన్నిధిలో ప్రభాకర్ గౌడ్
షిర్డీ సాయినాథుని సన్నిధిలో ప్రభాకర్ గౌడ్ - బాబాను దర్శించుకుని ప్రత్యేకపూజలు - శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిది : షిర్డీలో వెలసిన సాయి నాథున్ని తాండూరు మున్సిల్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు. గురువారం తన జన్మదినం సందర్భంగా ప్రభాకర్ గౌడ్ తన మిత్రులతో కలిసి షీర్డీకి వెళ్లారు. దేవాలయంలో సాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలన్నారు. తాండూరు ప్రజలు సుభీక్షంగా ఉండాలని సాయి నాథున్ని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, యువనాయకులు మహేష్ తదితరులు ఉన్నారు. ప్రభాకర్‌ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయనకు సన్మానించి శుభకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32876/