schedule Monday, July 06, 2026

పట్టణ వాసులకు మంచి తరుణం..!

calendar_today February 6, 2025
person dharshininews
పట్టణ వాసులకు మంచి తరుణం..!
పట్టణ వాసులకు మంచి తరుణం..! - ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై మున్సిపల్ దృష్టి - పరిష్కార ప్రక్రియకు వేగంగా చర్యలు - మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి దృష్టిసారిస్తున్నట్లు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్)కు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తాండూరు మున్సిపల్ పరిధిలో దాదాపు 12వేల 259 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించి మున్సిపల్ ఆధాయాన్ని పెంచుతామన్నారు. అదేవిధంగా లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం గతంలో రూ.1000లు చెల్లించిన దరఖాస్తులు దారులు రెగ్యులరైజ్ చేయించుకోవాలని సూచించారు. వచ్చేనెల మార్చి 31వ తేది లోపు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దరఖాస్తులు లేఅవుట్ల ఫీజులు చెల్లించి పరిష్కరించుకోవాలని సూచించారు. గడువు దాటితే ఫీజులు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32889/