schedule Monday, July 06, 2026

సహకార సంఘాలకు ఊరట..!

calendar_today February 14, 2025
person dharshininews
సహకార సంఘాలకు ఊరట..!
సహకార సంఘాలకు ఊరట..! - పదవి కాలం పొడగించిన ప్రభుత్వం - హర్షం వ్యక్తం చేసిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు - కృతజ్ఞతలు తెలిపిన జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని సహాకార సంఘాల పాలకవర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే శుభవార్తను అందించింది. అన్ని సహాకార సంఘాల పదవి కాలాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించిందని సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావును రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీబీ చైర్మన్లు కలిసి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారంతో సహాకార సంఘాల పదవి కాలం ముగియాల్సి ఉంది. ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహాకార సంఘాల పదవి కాలాన్ని మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడగించిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ తెలిపారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు పదవి కాలం పొడగింపు కోసం విశేష కృషి చేసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు రవీందర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా పాలకవర్గం పదవి కాలాన్ని ఆరు నెలలకు పొడగించేలా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. పదవి కాలం పొడగింపుతో రైతులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33074/