schedule Friday, September 11, 2026

ఘనంగా డా.సంపత్ సార్ జన్మదినం

calendar_today February 16, 2025
person dharshininews
ఘనంగా డా.సంపత్ సార్ జన్మదినం
ఘనంగా డా.సంపత్ సార్ జన్మదినం - కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.సంపత్ కుమార్ జన్మదినం పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం అర్దరాత్రి నుంచే డా.సంపత్ కుమార్ నివాసంలో జన్మదిన సందడి ఏర్పడింది. తాండూరుకు చెందిన యువనాయకులు ఇంతియాజ్ బాబా ఆధ్వర్యంలో అర్దరాత్రి డా.సంపత్ కుమార్ ను కలిసి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. డా.సంపత్ కుమార్‌తో పాటు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్‌ దంపతులను శాలువా, పూలమాలతో సన్మానించి.. కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు డా.సంపత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, ఫిరోజ్, పల్లు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33098/