schedule Monday, July 06, 2026

ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయ్..!

calendar_today February 17, 2025
person dharshininews
ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయ్..!
ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయ్..! - తాండూరు డివిజన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మాణాలు - ప్రతి మండలానికి ఒక గ్రామం ఎంపిక - ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామి మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో దూకుడు పెంచింది. ఇప్పటికే పలు జిల్లాలో కార్యాచరణ ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్లను ఎలా నిర్మిస్తుందో.. మోడల్‌ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టింది. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలను పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మించేందుకు సిద్దమైంది. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఇళ్లు నిర్మించాలని భావించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే గ్రామాలను ఎంపిక చేశారు. తాండూరు మండలంలో చెన్‌గేష్‌పూర్, యాలాల మండలంలో తిమ్మాయిపల్లి, బషీరాబాద్‌ మండలంలో కాశీంపూర్, పెద్దేముల్ మండలంలో మంబాపూర్ గ్రామాలలో ఇళ్లను నిర్మించే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు మొత్తం 5 విడతలగా నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందుకు గృహ నిర్మాణ శాఖ ఆయా గ్రామాల్లో పర్యటించేందుకు సిద్దమైంది. వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియపై నివేధికను తయారు చేయబోతోంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో ఓ మోడల్ ఇందిరమ్మ ఇళ్లును నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండల కేంద్రాల్లో ఈనెల 26న ఎమ్మెల్యే చేతుల మీదుగా మోడల్‌ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిలో ముందడుగు వేయడంతో పార్టీ నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33105/