schedule Friday, September 11, 2026

శివ భక్తుల సేవకు కదిలిన శంకరన్న...!

calendar_today February 17, 2025
person dharshininews
శివ భక్తుల సేవకు కదిలిన శంకరన్న...!
శివ భక్తుల సేవకు కదిలిన శంకరన్న...! - శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో అన్నదానంకు ఏర్పాట్లు - ఎల్లుండి నుంచి నాలుగు రోజులపాటు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపారంతో పాటు ఆధ్యాత్మిక భావాలు కలిగిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలర్ప్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ శివ భక్తుల సేవకు సిద్దమయ్యారు. ప్రతి యేడాది శ్రీశైలంలో శివ భక్తులకు అన్నదానం చేస్తూ సేవా భావాన్ని చాటుకుంటున్నారు. ఈ సారి కూడా శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో అన్నదానం చేసేందుకు సిద్దమయ్యారు. ఈనెల 19 నుంచి 22వ తేది వరకు అన్నదానం చేయాలని నిర్ణయించారు. తాండూరు నుంచి వచ్చే శివభక్తులతో పాటు స్థానిక భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు శంకర్ యాదవ్ మిత్ర బృందం తెలిపారు. శంకర్ యాదవ్ చేస్తున్న అన్నదానంలో భక్తులు పాల్గొని శివుని కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33150/