schedule Monday, July 06, 2026

సీతారంపేట్ హనుమాన్ దేవాలయంకు గ్రీన్ సిగ్నల్..!

calendar_today February 17, 2025
person dharshininews
సీతారంపేట్ హనుమాన్ దేవాలయంకు గ్రీన్ సిగ్నల్..!
సీతారంపేట్ హనుమాన్ దేవాలయంకు గ్రీన్ సిగ్నల్..! - పాలకవర్గం ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ - ప్రకటించిన దేవాలయ ఈఓ తాడెం నరేందర్ - దరఖాస్తులకు గడువు ఎప్పటి వరకు అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ పాలకవర్గ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయినట్లు ఈఓ తాడెం నరందర్ తెలిపారు. సోమవారం దేవాదాయ శాఖ హైదరాబాద్ ఉప కమీషనర్ ట్రస్టు ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైన 20 రోజులలోపు పాలకవర్గం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులను రంగారెడ్డి జిల్లా సహాయ కమీషనర్ దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యాలయంలో సమర్పించాలని స్పష్టం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33155/