schedule Monday, July 06, 2026

బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక సేవ ప్రశంసనీయం

calendar_today February 26, 2025
person dharshininews
బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక సేవ ప్రశంసనీయం
బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక సేవ ప్రశంసనీయం - తాండూరు కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి - బ్రహ్మ కుమారి సమాజంలో శివరాత్రి వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆధ్యాత్మికత అభివృద్ధిలో తాండూరు బ్రహ్మ కుమారీల సేవ ఎంతో ప్రశంసనీయమని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని బ్రహ్మకుమారీ సమాజంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి హాజరై సమాజం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగిఉండాలన్నారు. శాంతి, ప్రేమ, పరమత సహనం, పరోపకారం వంటి సద్గుణాలను పెంపొందించుకోవాలన్నారు. ధర్మం, నీతి, శాంతి సద్గుణాల అభివృద్ధిలో బ్రహ్మ కుమారీ సమాజం చేస్తున్న సేవలు ప్రశంసనీయమననారు. ఇదే స్ఫూర్తితో అందరు శివుని కృపతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్, బ్రహ్మకుమారీ సమాజం ప్రతినిధులు జగదేవి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33463/