schedule Saturday, July 04, 2026

ఇందిరమ్మ ఇళ్లకు మరోచాన్స్..!

calendar_today February 28, 2025
person dharshininews
ఇందిరమ్మ ఇళ్లకు మరోచాన్స్..!
ఇందిరమ్మ ఇళ్లకు మరోచాన్స్..! - మిగిలిపోయిన మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం - నిర్ణయించిన గృహ నిర్మాణ శాఖ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇందిరమ్మ నమూనా ఇండ్లను నిర్మించగా.. త్వరలో నిర్మించ బోయో ఇండ్ల కోసం గ్రామానికో మేస్త్రీకి శిక్షణ ఇచ్చేందుకు సిద్దమయ్యింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులకు మరో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం వద్దకు వచ్చిన దరఖాస్తులను అధిరారులు పరిశీలన పూర్తైన దరఖాస్తులను 3 రకాలుగా విభజించారు. స్థలం ఉండి, ఇల్లు లేని వారు. వీరిని L-1గా గుర్తించారు. అలాగే.. ఇల్లు, స్థలం రెండూ లేనివారు రెండో రకం. వీరిని L-2గా గుర్తించారు. ఇక అర్హత లేని వారు మూడో రకం. ఇలా.. మొత్తం వచ్చిన 10,70,859 దరఖాస్తులను 3 రకాల లిస్టులుగా రెడీ చేశారు. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం పొందేవారు.. ఈసారి జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు, విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని, అందుకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా అధికారులు.. మళ్లీ పరిశీలించి.. వారిని కూడా అర్హుల జాబితాలో చేర్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల దరఖాస్తు నింపేటప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా అర్హుల జాబితా రాగానే... దరఖాస్తు చేసుకున్న వారి మొబైళ్లకు మెసేజ్‌లు పంపాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత స్థలం ఉన్న లబ్దిదారులు వెంటనే.. ముగ్గుపోసి, బేస్‌మెంట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 10 నుంచి ప్రభుత్వం బేస్‌మెంట్ వేసుకున్నవారికి తొలివిడత రూ.1లక్ష సాయం అందించనుంది. మిగతా 4 లక్షలను 3 విడతలుగా ఇవ్వనుంది. ఇలా ఇందిరమ్మ ఇళ్ల పథకం జోరుగా సాగనుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33540/