schedule Friday, September 11, 2026

కుల వృత్తుల కుదేలు..!

calendar_today March 5, 2025
person dharshininews
కుల వృత్తుల కుదేలు..!
కుల వృత్తుల కుదేలు..! - ఇతర వ్యాపారులతో బీసీలకు ఆర్థిక సంక్షోభం - పడమర రాష్ట్ర కార్మికులతో చితుకుతున్న సబ్బండ వర్గాలు - ప్రభుత్వాలు స్పందించి న్యాయం చేయాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇతర వ్యాపారులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన కుల వృత్తులు కుదేలు అవుతున్నాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో ఆవేధన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు వ్యాపారాలను ప్రారంభించడంతో రజక, కమ్మరి, కంసాలి, నాయి బ్రహ్మణ, విశ్వ బ్రహ్మణ, విశ్వకర్మలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారని అన్నారు. గత కోన్నేళ్లుగా తాండూరులో గుజరాజ్, బీహార్, రాజస్థాన్, హర్యాణా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థిరపడ్డారని అన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పేయింటర్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రిషన్లే పనులు చేసుకుంటున్నారని అన్నారు. చాయ్ దుకాణాల నుంచి బడా షోరూంల వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఇతర వ్యక్తులే పెత్తనం చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లక్షలలో వి స్తరించారని అన్నారు. ఢిల్లీ సెలూన్ల పేరుతో ఆధునిక యంత్రాలతో వ్యాపారం మొదలు పెట్టడడంతో కులవృత్తులపై ఆధారపడి జీవించే నాయి బ్రహ్మాణులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన పేదవాళ్లు అడుక్కునే పరిస్థితి వస్తోందని భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే స్పందించి బీసీ సామాజిక కులవృత్తి దారులను ఆదుకుని అభివృద్ధి చెందేలా చూడాలని కోరారు. బీసీ సామాజిక కుల వృత్తిదారులు కూడా ఉచిత పథకాల ప్రలోభాలకు గురికాకుండా వృత్తులపై దృష్టిపెట్టాలని ఆకాంక్షించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33775/