schedule Thursday, September 03, 2026

సమ్మర్ సపోటా.. వేరీ పవర్..!

calendar_today March 6, 2025
person dharshininews
సమ్మర్ సపోటా.. వేరీ పవర్..!
సమ్మర్ సపోటా.. వేరీ పవర్..! - జీర్ణ సమస్యలకు మంచి ఔషధం - గుండె వ్యాధులకు భరోసా దర్శిని డెస్క్ : మార్కెట్లో దొరికే సపోటా పండ్లను తినేందుకు చాల తక్కువ మందే ఇష్టపడతారు. ఇందులోని ఔషధాలు గురించి తెలిస్తే తినకుండ ఉండలేరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటి గురించి కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకుని తీరాలి. ఈ పండ్లలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ, ఈ చెట్టు అన్ని ప్రాంతాల్లో పెరగదు. ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది. శరీరంలో బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే శరీరం వెంటనే శక్తిని పుంజుకుంటుంది. వీటికి అంత పవర్ ఉంది. గుండె ఆరోగ్యం.. సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్నితగ్గిస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణను ఆరోగ్యంగా ఉంచడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ దండిగా ఉండే పండు.. మన రోజూవారి ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. మలబద్ధకం అందులో ప్రధానమైంది. సపోటాల్లో ఫైబర్ కావలసినంత దొరుకుతుంది. ఒక్కో పండులో దాదాపు 9 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగు పరిచి గట్ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలకు.. ఎవరైతే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇదొక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో టానిన్లు, ఫాలీఫెనాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గిస్తాయి. అలసటకు రామబాణం.. సాధారణంగా ఈ పండ్లు వేసవిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎండాకాలం రాగానే డీహైడ్రేషన్ కారణంగానో లేక అధిక ఉష్ణోగ్రతల వల్లనో నీరసం నిస్సత్తువ కమ్మేస్తుంటాయి. అలాంటప్పుడు రెండు సపోటాలను తిన్నారంట ఇక వెంటనే హుషారుగా మారిపోతారు. అతిగా తింటు అనర్థాలు సపోటాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటి రుచి కూడా గొప్పగా ఉంటుంది. అందుకని వీటిని మోతాదు మించి తీసుకుంటే అనర్థాలే వస్తాయి. సపోటాలను అదేపనిగా తినడం మంచిది కాదు. దీని వల్ల అజీర్ణంతో పాటు పొట్ట ఉబ్బరం సమస్య కూడా వస్తుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33779/