schedule Saturday, September 12, 2026

కొత్త మంత్రులు వస్తున్నారు...!

calendar_today March 25, 2025
person dharshininews
కొత్త మంత్రులు వస్తున్నారు...!
కొత్త మంత్రులు వస్తున్నారు...! - ప్రమాణ స్వీకారం తేది ఇదే కావచ్చు - మంత్రులగా వీళ్లకే చాన్స్..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణపైనే అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బీసీ, ఎస్సీ వర్గాకు చెందిన వారకి మంత్రి పదువులు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రాష్ట్ర కోర్‌ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది. ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సమాచారం. సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీలో శ్రీహరి ముదిరాజ్‌, ఆది శ్రీనివాస్‌కు.. ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉంది. మైనారిటీలకు అవకాశమిస్తే ఎమ్మెల్సీ అమీర్‌ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. కొత్త మంత్రులతో వచ్చేనెల ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34234/