schedule Thursday, September 03, 2026

తమలపాకు లవంగంతో ప్రయోజనాలు..!

calendar_today March 27, 2025
person dharshininews
తమలపాకు లవంగంతో ప్రయోజనాలు..!
తమలపాకు లవంగంతో ప్రయోజనాలు..! - ఇమ్యూనిటితో భయంకర రోగాలకు చెక్ - శ్వాసకోస వ్యాధుల నుంచి ఉపశమనం దర్శిని డెస్క్ : ప్రకృతి నుంచి మనకు లభించే మొక్కలు, ఆకులతో పాటు ఇతర వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. అందులో తమలపాకు, లవంగాల నుంచి కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. తమలపాకు, లవంగాలను కలిపి తినడం వల్ల శరీరానికి విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, ఫైబర్, థయామిన్, యూజినాల్ ఇంకా అనేక యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. తమలపాకులు, లవంగాలు రెండూ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లవంగాలు, తమలపాకులు తినడం వల్ల కఫం తగ్గుతుంది. అలాగే, ఇది జలుబు, దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది. శ్వాసకోశ వ్యాధులలో ఉపశమనం అందిస్తుంది. తమలపాకులు, లవంగాలు రెండూ మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహానికి ఉపయోగపడుతుంది. లవంగాలు, తమలపాకులు తినడం వల్ల కఫం తగ్గుతుంది. అలాగే, ఇది జలుబు, దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది. శ్వాసకోశ వ్యాధులలో ఉపశమనం అందిస్తుంది. తమలపాకులు, లవంగాలు రెండూ మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహానికి ఉపయోగపడుతుంది. తమలపాకులో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. లవంగంలో యూజినాల్, ఫైబర్ ఉంటాయి. ఇది ఆమ్లత్వం, అజీర్ణం, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. లవంగాలు, తమలపాకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అవి నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా శ్వాసను తాజాగా ఉంచుతాయి. నోటి దుర్వాసనను తొలగిస్తాయి. లవంగాలు, తమలపాకులు రెండూ యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఈ అంశాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది వ్యాధులను నివారిస్తుంది. (గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్యులను సంప్రదించడం మంచిది) ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34283/