schedule Friday, September 04, 2026

మోదుగ పువ్వులో ఔషదాలు..!

calendar_today April 12, 2025
person dharshininews
మోదుగ పువ్వులో ఔషదాలు..!
మోదుగ పువ్వులో ఔషదాలు..! - రక్తాన్ని శుద్దిచేసే పవర్స్ - కంటి, చర్మ సమస్యలకు చెక్ - మూత్ర ఇబ్బందులకు పరిష్కారం దర్శిని డెస్క్ : మోదుగ పూలు అంటే పల్లెటూరి వారికి పరిచయం అక్కర్లేని పేరు. గ్రామాల్లోని ప్రజలు మోదుగ చెట్టు నుంచి, పూల నుంచి ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందుతుంటారు. సరిగ్గా వసంతకాలం ముందు ఈ పూలు పూస్తాయి. వీటిని అగ్ని పూలు అని కూడా అంటారు. మోదుగ పువ్వులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్ల లాంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేయడానికి మోదుగ చెట్టు బెరడు బాగా ఉపయోగపడుతుంది. రక్తం శుద్ధి అయితే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. చర్మ సమస్యల నుంచి జీర్ణ సమస్యల వరకు మోదుగ పువ్వు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం. మోదుగ పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..ఆయుర్వేదంలో వీటిని అనేక వ్యాధులకు మందుగా ఉపయోగిస్తున్నారు. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మోదుగ పూలు చాలా మంచిది. ఇది అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. మోదుగ విత్తనాల్ని పొడి చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మోదుగ పువ్వు నిద్ర సమస్యలను దూరం చేస్తుందట. మోదుగ ఆకుల రసం తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో చాలా మందికి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. మోదుగ పువ్వుల గింజల పొడిని వాడితే దురద తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మోదుగ పూలు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మోదుగ పువ్వుల మొగ్గలు చాలా మంచిదట. దీని పొడిని వాడితే చాలా వ్యాధులు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మోదుగ చెట్టు బెరడు డయేరియాను నివారిస్తుందట. దీని గింజలు క్రిమిసంహారకంగా పనిచేస్తాయి. ఆకలిని కూడా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34726/