కర్బూజలో పోషకాలు..!
April 16, 2025
dharshininews
కర్బూజలో పోషకాలు..!
- కడుపు, కంటి సమస్యలపై బ్రహ్మాస్త్రం
- కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి
దర్శిని డెస్క్ : వేసవి సీజన్లో లభించే పండు కర్బూజ కూడా ఒకటి. ఇందులోని పోషకాలతో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. కడుపు, కంటి సమస్యలపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాలు శరీరాన్ని హైడ్రెటెడ్‌గా ఉంచడటంతోపాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కర్బూజ పండులో నీటిశాతం ఎక్కువ.. కావున దీన్ని తినడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
అందుకే దీనిని రెగ్యులర్‌గా తినాలని డైటీషియన్లు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో కర్బూజను తినడం వల్ల అనేక వ్యాధులను నియంత్రించవచ్చు.. అలాగే.. ఆ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీరంలో నీటి కొరతను, పోషకాల కొరతను నివారించాలంటే దీనిని తప్పనిసరిగా తినడం మంచిది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో కర్బూజను తింటే గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.. ఇది మీ రక్తాన్ని శుద్ధి చేయడంలో.. అలాగే రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో ఇది మీకు చాలా సహాయపడుతుంది.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు రోజూ కర్బూజను తీసుకుంటే.. కిడ్నీల్లో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. వేసవిలో తరచూ గ్యాస్, అజీర్తి, మలబద్దకం, కడుపులో నొప్పి, జీర్ణ సమస్యలతో ప్రజలు బాధపడుతుంటారు.. అయితే, ఈ సీజన్‌లో ఎక్కువ నూనె, మసాలాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. కావున, ఇలాంటి సమయంలో సులభంగా జీర్ణమయ్యే కర్బూజను తినడం ద్వారా.. కడుపు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కర్బూజ తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.. దీనిలో విటమిన్ ఎ బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి మీ కంటి చూపును మెరుగుపర్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. లైంగిక సమస్యలు దూరం: కర్బూజలో విటమిన్ కె, ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. దీని వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల లైంగిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి....
https://www.dharshininews.com/34856/