schedule Saturday, September 05, 2026

ఇండియా టీవీలో మనోడి జర్నీ..!

calendar_today April 16, 2025
person dharshininews
ఇండియా టీవీలో మనోడి జర్నీ..!
ఇండియా టీవీలో మనోడి జర్నీ..! - తాండూరు మూన్‌ వాకర్‌ అరుదైన ఘనత - సాధించిన రికార్డుల ప్రసారానికి అవకాశం - ఎలా ఎంపిక చేశారంటే...? తాండూరు, దర్శిని ప్రతినిధి : లెజండ్ మైఖెల్‌ జాక్సన్‌ మూన్‌ వాక్‌ రికార్డును బద్దలు కొట్టిన తాండూరుకు చెందిన వంశీకృష్ణ మరో అరుదైన ఘనత సాధించేందుకు సిద్దమయ్యాడు. ఇండియా టీవీలో వంశీ కృష్ణ డాక్యుమెంటరీ ప్రసారం చేస్తున్నట్లు టీవి ప్రతినిధులు ఈమేయిల్ పంపారు. కళారంగంలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలలో అరుదైన రికార్డులు సాధించిన ప్రముఖుల డాక్యుమెంటరీలను ఇండియా టీవీలో ప్రసారం చేస్తారు. ఇప్పటికే వంశీకృష్ణ మూన్‌ వాక్‌ రికార్డుతో పాటు లిమ్కా బుక్‌లో స్థానం దక్కించుకున్నారు. నాన్‌చాక్, ర్యాప్ వంటి తదితర రంగాలలో కూడా రికార్డులు సాధించారు. ఈ మేరకు తాండూరుకు చెందిన వంశీ కృష్ణకు అవకాశం ఇచ్చారు. త్వరలో ఇండియా టీవిలో 6 నిమిషాల పాటు వంశీ కృష్ణ డాకుమెంటరీ లో వంశీ బాల్యం, విద్యాభ్యాసం, జన్మదిన స్థలం తదితర విషయాలని ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు మూన్ వాకర్ వంశీ ని అభినందించారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34906/