schedule Monday, July 06, 2026

సీతారాంపేట్ హనుమాన్ పాలకవర్గం నియామకం

calendar_today April 17, 2025
person dharshininews
సీతారాంపేట్ హనుమాన్ పాలకవర్గం నియామకం
సీతారాంపేట్ హనుమాన్ పాలకవర్గం నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ - ఆలయ అధ్యక్షులుగా దొరశెట్టి భీమలింగం తాండూరు, దర్శని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ పాలకవర్గం నియామకం అయ్యింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయ ట్రస్టు సభ్యులుగా దొరశెట్టి భీమలింగం, ఎం. నర్సింలు, బీ. నర్సింలు, బీ. మంజుల, కె. విశ్వనాథ్ లను నియమించినట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో దేవాలయ చైర్మన్ గా భీమలింగ పేరు ఖరారు అయ్యింది. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ గా ఎన్నికైన భీమలింగం మాట్లాడుతూ దేవాలయ చైర్మన్ గా అవకాశం కల్పించడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34935/