schedule Wednesday, September 09, 2026

భద్రేశ్వర భక్తులకు నిత్యాన్నదానం

calendar_today April 18, 2025
person dharshininews
భద్రేశ్వర భక్తులకు నిత్యాన్నదానం
భద్రేశ్వర భక్తులకు నిత్యాన్నదానం - వీరశైవ సమాజం సాయంతో వితరణ - రోజు రోజుకు పోటెత్తుతున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని గత మూడు రోజుల నుంచి నిత్యాన్నధానం నిర్వహిస్తున్నారు. దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, ఆలయ కమిటి, వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్‌ సభ్యుల సహాకారంతో భక్తులకు నిత్యాన్నదానం చేస్తున్నారు. శుక్రవారం తాండూరు వీరశైవ సమాజం దాతలుగా అన్నదానంకు సహాకరించారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న నిత్యాన్నదానంకు భక్తులు పోటెత్తుతున్నారు. జాతర ఉత్సవాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు స్వామి వారిని దర్శించుకుని దాసోహ మందిరంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదానంలో పాల్గొని మహా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. భక్తుల కోసం నిర్వహకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34945/