schedule Thursday, September 03, 2026

ఉల‌వ‌ల్లో.. అద్భుతాలు..!

calendar_today April 19, 2025
person dharshininews
ఉల‌వ‌ల్లో.. అద్భుతాలు..!
ఉల‌వ‌ల్లో.. అద్భుతాలు..! - తింటే సమస్యలన్నీ పరార్ - శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ దర్శిని డెస్క్ : ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని మన పెద్దవాళ్లు చెప్పేవారు. మొదట్లో గుర్రాలు, పశువుల మేతగా ఉపయోగించేవారు. చాలా పోషకాలతో నిండిన ఉలవల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిల్లో తెల్లవి, నల్లవి అని రెండు రకాలుగా లభిస్తాయి. ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ లాంటివి పోషకాలు వీటిల్లో పుష్కలంగా లభిస్తాయి. బీ1, బీ2, బీ6, సీ, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారినికి సమానమైన ప్రోటీన్‌ కూడా లభిస్తుంది. ఉలవలు మన శరీరానికి శక్తిని అందించడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఎదుగుదలకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. వారికి బలాన్ని ఇస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. ఉలవలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని తగ్గిస్తాయి. చర్మ సమస్యల నివారణలో, కీళ్ళ నొప్పుల నివారణలో బాగా పని చేస్తాయి. ఉలవల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికల్ని మెరుగుపర్చి మలం సాఫీగా వచ్చేలా చేస్తుంది. తద్వారా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఉలవలు తినడం ఎంతో మంచిది. వీటిలోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో దోహదపడుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంచుతుంది. కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కల్పించడంలో ఉలవలు దోహదపడతాయి. వీటిలోని పోషకాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడంలో ఉలవలు సహాయపడతాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపడుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తినడం చాలా మంచిది. ఉలవలు తీసుకోవడం ద్వారా ఎక్కిళ్ల సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. జ్వరం, ఆయాసం, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవల కషాయం తాగడం ఎంతో మేలు. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలు నివారించడంలో ఉలవలు సహాయపడతాయి. దీనికోసం ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు ఈ చిట్కా పాటించండి. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34951/