schedule Monday, July 06, 2026

భద్రేశ్వరున్ని దర్శించుకున్న కమీషనర్‌..!

calendar_today April 19, 2025
person dharshininews
భద్రేశ్వరున్ని దర్శించుకున్న కమీషనర్‌..!
భద్రేశ్వరున్ని దర్శించుకున్న కమీషనర్‌..! - పల్లకిసేవలో స్వామికి ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వరుని జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం జాతర ఉత్సవాలలో ప్రముఖులు భద్రేశ్వరున్ని దర్శించుకుంటున్నారు. పట్టణ పురవీధుల్లో కొనసాగిన పల్లకిసేవలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి భద్రేశ్వరున్ని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజల దైవం భద్రేశ్వరుని కృపతో అంతా మంచే జరగాలి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇనుస్పెక్టర్ ఉమేష్‌ కుమార్, భక్తులు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34954/