schedule Friday, September 11, 2026

లగచర్ల రైతులకు రూ.2.49 కోట్ల చెక్కుల పంపిణీ

calendar_today April 22, 2025
person dharshininews
లగచర్ల రైతులకు రూ.2.49 కోట్ల చెక్కుల పంపిణీ
లగచర్ల రైతులకు రూ.2.49 కోట్ల చెక్కుల పంపిణీ - అందజేసిన తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు(ఎంపీఐపీ) కోసం భూములు అందించిన లగచర్ల రైతులకు చెక్కులు పంపీణీ చేశారు. మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా 12ఎకరాల 19 గుంటల భూమిని అందించిన 10 మంది రైతులకు రూ.2 కోట్ల 49 లక్షల 50ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక పార్కు కోసం భూములు కోల్పోయిన హకీంపేట్ రైతులకు అందించిన పరిహారాన్ని సద్వినియోగం చేసుకొ వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35051/