పహెల్గాం ఉగ్రదాడి హేయం..!
April 23, 2025
dharshininews
పహెల్గాం ఉగ్రదాడి హేయం..!
- మత విద్వేషాలను సహించేది లేదు
- దోషులను కఠినంగా శిక్షించాలి
- తాండూరులో ముస్లిం వేల్ఫేర్ నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : జమ్ము కాశ్మీర్ లోని పహెల్గాంలో జరిగిన దాడి అంత్యంత హేయమైన చర్యగా తాండూరు ముస్లిం సోదరులు అభివర్ణించారు. ఉగ్రమూకలు చేసిన దాడిలో మృతుల పట్ల బుధవారం రాత్రి తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు.
జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ.. కొవ్వొత్తులు వెలిగించి మృతుల ఆత్మలకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్ లోని పహెల్గాంలో జరిగిన దాడి అందరిని కలిచివేసిందన్నారు. దేశంలో జీవిస్తున్న అన్ని వర్గాల మద్య విద్వేశాలు రెచ్చగొట్టేందుకు ఈ కుట్ర జరిగిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలోని నిఘా విభాగం వైఫల్యం వల్ల ఇంత దారణం జరిగిందని విమర్శించారు. గతంలో జరిగిన పుల్వామా, తాజాగా పహెల్గాం ఘటనలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మారాయని అన్నారు.
ఉగ్రదాడులను దేశంలో నివసిస్తున్న వారంతా వ్యతిరేకిస్తున్నారని, వీటిని ఎవ్వరు సహించరని అన్నారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దాడిలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, ప్రధాన కార్యదర్శి ఎండీ యూనుస్, పలువురు ముస్లిం నాయకులు, పెద్దలు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి....
https://www.dharshininews.com/35080/