schedule Thursday, September 10, 2026

నాపరాతి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి

calendar_today April 24, 2025
person dharshininews
నాపరాతి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి
నాపరాతి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నాపరాతి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి తాండూరు పట్టణంలోని స్టోన్ భవన్ లో స్టోన్ అసోసియేషన్, క్వారీ అసోసియేషన్ల సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా వ్యాపారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టోన్, క్వారీ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ రవూఫ్, నయూం(అప్పూ), జుబేర్ లాల, కాంగ్రెస్ నాయకులు డా. సంపత్ కుమార్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35095/