schedule Monday, July 06, 2026

రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత

calendar_today April 24, 2025
person dharshininews
రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత
రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత - నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా దృష్టి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - బండపల్లి - మైల్వార్ డబుల్ రోడ్డుకు శంకుస్థాపన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండలం జుంటుపల్లి వద్ద బండపల్లి నుంచి బషీరాబాద్ మండలం మైల్వార్, రుద్రారం, నీళ్లపల్లి ఇస్మాయిల్ పూర్ గ్రామాలకు ఎస్టీఎఫ్ నిధులు రూ.55కోట్లలో చేపడుతున్న డబుల్ లైన్ రోడ్డు పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. రోడ్లను నాణత్య ప్రమాణాలతో త్వరగా పూర్తి చేసేలా దృష్టిసారించడం జరగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మండలాల కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, యువనేతలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి....   https://www.dharshininews.com/35122/ https://www.dharshininews.com/35116/