schedule Thursday, September 10, 2026

మినరల్ వాటర్‌తో చలివేంద్రం..!

calendar_today April 25, 2025
person dharshininews
మినరల్ వాటర్‌తో చలివేంద్రం..!
మినరల్ వాటర్‌తో చలివేంద్రం..! - రైల్వే ప్రయాణికుల కోసం ఏర్పాటు - మార్వాడి యువమంచ్‌ సేవాతత్పరత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో స్థానిక మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో మినరల్‌ వాటర్‌తో చలివేంద్రం ఏర్పాటు చేశారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైల్వే స్టేషన్‌లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. రైల్వే అధికారులు కమర్షియల్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ అభ్యర్థన మేరకు సమాజ్ దాతల సహకారంతో స్టేషన్‌లోని ఫ్లాట్ ఫారం 1వద్ద మినరల్ వాటర్ తో చలివేండ్రం ప్రారంభించినట్లు మంచ్ అధ్యక్షులు అనిల్ కుమార్ సార్డా తెలిపారు. మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా మాట్లాడుతూ రైల్వే స్టేషన్ లో 15 సంవత్సరల తర్వాత చలివేంద్రమ్ ప్రారంభం చేయడం జరిగిందన్నారు. త్వరలోనే స్టషన్‌లోని 2వ ప్లాట్ ఫారంపై కూడా చలివేంద్రం ప్రారంభం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచ్ కార్యదర్శి సచిన్ రాఠీ, కోశాధికారి అరుణ్ సార్డా, సునిల్ సార్డా, కిషన్ రాఠీ, దీపక్ బూబ్, నీహర్ సోమాని, నిఖిల్ అగర్వాల్, శుభం సార్డా తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35137/