schedule Monday, July 06, 2026

పట్టుదలతో నమ్ముకుంటే విజయం సొంతం

calendar_today April 25, 2025
person dharshininews
పట్టుదలతో నమ్ముకుంటే విజయం సొంతం
పట్టుదలతో నమ్ముకుంటే విజయం సొంతం - ఎంసెట్లో బాలికలు ఉత్తమ ర్యాంకులు సాధించాలి - కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టుదలను నమ్ముకుంటే విజయం సొంతం అవుతుందని కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి అన్నారు. సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో తాండూరులో గత నెల రోజులుగా బాలికలకు నిర్వహించి ఉచిత ఎప్ సెట్ శిక్షణ శిబిరం ముగింపు శుక్రవారం జరిగింది. హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శాలివాహాన డిగ్రీ కాలేజీ యజమాన్య కమిటి అధ్యక్షులు కల్వ రాధాకృష్ణ, ముఖ్య వక్తగా కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారని నానుడిలో భాగంగా బాలికల కోసం ఉచిత ఎప్ సెట్ కోచింగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. శిక్షణ పొందిన బాలికలు పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కల్వ రాధాకృష్ణ మాట్లాడుతూ బాలికలకు ఉచిత శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అనంతరం శిక్షణ పొందిన బాలికలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, హిందూ ధార్మిక పరిషత్ కోకన్వినర్లు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, నరేందర్ ముదిరాజ్, ట్రస్టీలు ఓం ప్రకాష్ సోమాని, పటేల్ విజయ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35157/