schedule Monday, July 06, 2026

రసూల్ పూర్ హనుమాన్ దేవాలయానికి నోటిఫికేషన్

calendar_today April 26, 2025
person dharshininews
రసూల్ పూర్ హనుమాన్ దేవాలయానికి నోటిఫికేషన్
రసూల్ పూర్ హనుమాన్ దేవాలయానికి నోటిఫికేషన్ - పాలకవర్గ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం - ప్రకటించిన దేవాదాయ శాఖ ఈఓ తాడెం నరేందర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం రసూల్ పరిధిలోని ఆంజనేయ స్వామి దేవాలయం పాలకవర్గం ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్ దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు దేవాలయ ఈఓ తాడెం నరేందర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేవాలయ పాలకవర్గ సభ్యుల నియామకానికి దరఖాస్తులను కోరుతున్నట్లు వెల్లడించారు. నోటిఫికేషన్ విడుదలైన 20 రోజులలో ఆసక్తిగల అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. గడువు అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో పాలకవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35191/