schedule Friday, September 11, 2026

ఉగ్రదాడి.. దుర్మార్గం..!

calendar_today April 26, 2025
person dharshininews
ఉగ్రదాడి.. దుర్మార్గం..!
ఉగ్రదాడి.. దుర్మార్గం..! - వినాయక ఆసుపత్రి నిరసన వెల్లువ - పహెల్గాం మృతులకు నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దుర్మార్గం.. పిరికిపంద చర్యగా తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యజమాన్యం అభివర్ణించింది. శనివారం ఉగ్రదాడిని ఖండిస్తూ.. శనివారం రాత్రి తాండూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆసుపత్రి నిర్వహకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఆదేశాలతో ఆసుపత్రి ఎండి డా.చందులాల్ ఆధ్వర్యంలో డా.విజయ్ కుమార్, వైద్యులు, సిబ్బంది కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ ఆసుపత్రి నుంచి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా మీదుగా ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతులకు నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటకుపై తీవ్రవాదులు దాడులు చేయడం పిరికిపంద చర్య అన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని గుర్తించి కేంద్రం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35197/