schedule Monday, July 06, 2026

లీకేజీ గుంతలో ఇరుక్కు పోయిన లారీ

calendar_today April 28, 2025
person dharshininews
లీకేజీ గుంతలో ఇరుక్కు పోయిన లారీ
లీకేజీ గుంతలో ఇరుక్కు పోయిన లారీ - నడి రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం - ఇబ్బందులు పడ్డ వాహనదారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాగునీటి పైపులైన్ లీకేజీ మరమ్మత్తుల తరువాత పూడ్చిన గుంతలో లారీ ఇరుక్కుపోయింది. నడిరోడ్డు మధ్య లారీ మోరాయించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం అంబేద్కర్ చౌరస్తా సమీపంలో పట్టణ వాసులకు తాగునీరు అందించే మన్సిపల్ పైపులైన్ లీకేజీకి గురైంది. ఇటీవలే మన్సిపల్ సిబ్బంది. పెపులైన్ లీకేజీ కోసం గుంత తవ్వి మరమ్మత్తులు పూర్తి చేశారు. తాజాగా సోమవారం సాయంత్రం కోడంగల్ రోడ్డు వైపు వెళుతున్న నాపరాతి లోడ్ లారీ మార్గంలో వెళుతూ లీకేజీకి మరమ్మత్తులు చేసి వదిలిన గుంతలో ఇరుక్కుపోయింది. లారీని బయటకు తీసేందుకు లారీ డ్రైవర్ శత విధాలుగా ప్రయత్నం చేశారు. లారీ మోరాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని బయటకు తీసే చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35243/