schedule Monday, July 06, 2026

శభాష్ పట్లోళ్ల సాహిత్ రెడ్డి..!

calendar_today April 30, 2025
person dharshininews
శభాష్ పట్లోళ్ల సాహిత్ రెడ్డి..!
శభాష్ పట్లోళ్ల సాహిత్ రెడ్డి..! - పది ఫలితాలో జిల్లా సెకండ్ టాపర్ రికార్డు తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్ పట్లోళ్ల సాహిత్ రెడ్డి అంటూ తాండూరు శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని పలువురు అభినందించారు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాలలో పట్లోళ్ల సాహిత్ రెడ్డి వి కారాబాద్ జిల్లా సెకండ్ టాపర్ గా నిలిచాడు. తాండూరు ప్రాంతానికి చెందిన సీనీయర్ జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డి, ప్రియాంక రెడ్డిల కుమారుడు శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. ఇటీవల పరీక్షలు రాసాడు. బుధవారం విడుదలైన ఫలితాలలో 582/600 మార్కులు సాధించి జిల్లా సెకండ్ టాపర్ గా నిలిచాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో పాటు నాన్నమ్మ పట్లోళ్ల అశోకమ్మ, స్కూల్ చైర్మన్ ద్యావరి విష్ణువర్దన్ రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డిలు అభినందించారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35311/