schedule Monday, July 06, 2026

శభాష్.. పత్తి సరిత..!

calendar_today May 1, 2025
person dharshininews
శభాష్.. పత్తి సరిత..!
శభాష్.. పత్తి సరిత..! - భగవద్గీత శ్లోకాల పోటీలో గోల్డ్ మెడల్ - సన్మానించిన కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య - అభినందించిన గీతా సత్సంగ్ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆద్యాత్మిక రంగాలలో ముఖ్య పాత్ర పోషిస్తారంటూ నిరూపించిన పత్తి సరితా రత్నాకర్ ను శభాష్ అంటూ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అభినందించారు. మైసూర్ లోని శ్రీగణపతి సచ్చిదానంద దత్తపీఠం ఆధ్వర్యంలో ప్రతి యేడాది భగవద్గీత శ్లోకాల పఠనం పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ మేన కోడలు పత్తి సరితా పాల్గొని భగద్గీతలోని 18 అధ్యాయాలలో 700 శ్లోకాలను అనర్గంళంగా పఠించింది. ఇందుకు గాను సరిత మొదటి స్థానంలో నిలిచి ఈనెల 18న దత్తపీఠం స్వామి వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోనుంది. ఇందులో భాగంగా గురువారం కోట్రిక విజయలక్ష్మీ తన నివాసంలో పత్తి సరితా రత్నాకర్ దంపతులను శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా తాండూరు గీతా సత్సంగ్ సమితి సభ్యులు కూడా హాజరై పత్తి సరితా రత్నాకర్ ను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ, కోట్రిక శ్రీకాంత్, గీతా సత్సంగ్ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35368/