schedule Monday, July 06, 2026

తిరుపతి భక్తులకు గుడ్‌ న్యూస్..!

calendar_today May 2, 2025
person dharshininews
తిరుపతి భక్తులకు గుడ్‌ న్యూస్..!
తిరుపతి భక్తులకు గుడ్‌ న్యూస్..! - తాండూరు, వికారాబాద్‌ మీదుగా స్పెషల్ ట్రైన్ - రాకపోకల టైమింగ్‌ను ప్రకటించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : కలుయుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. వికారాబాద్‌, తాండూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షణ మద్య రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరే ఈ రైలు మే 8 నుంచి 30వ తేదీ వరకు రాకపోకలు సాగించనుందని వెల్లడించారు. ఈ రైలు చర్లపల్లిలో సాయంత్రం. 4.30గంటలకు, మరునాడు తిరుప తిలో నుంచి మధ్యాహ్నం 12:30 గంట లకు బయల్దేరుతుంది. ఈ రైలుకు సనత్నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, కర్ణాటక రాష్ట్ర సేడం, యాద్గిర్, రాయచూర్, ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయం, ఆదోని, గుంత కల్లు, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూరు, రేణి గుంట స్టేషన్లలో హాల్ట్ ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. గతంలో తిరుప తికి రాయలసీమ ఎక్స్ ప్రెస్, వీక్లీ ఎక్స్ ప్రెస్లుండేవి. ఇప్పుడు ఈ ప్రత్యేక రైలుతో తిరుమలకు వెళ్లేవారికి మరింత సౌకర్యం కలగనుంది. వేసవి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - తిరు పతి(07257), తిరుపతి-సికింద్రా బాద్(07258) ప్రత్యేక రైలును నడుపు తామని రైల్వే అధికారులు పేర్కొ న్నారు.   ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35391/