schedule Monday, July 06, 2026

పనివద్దనే పోయిన ప్రాణం..!

calendar_today May 2, 2025
person dharshininews
పనివద్దనే పోయిన ప్రాణం..!
పనివద్దనే పోయిన ప్రాణం..! - అనుమానాస్పద స్థితిలో ఎలక్ట్రీషీయన్ మృతి - ఇందూరు సోలార్ ప్లాంట్ వద్ద ఘటన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఓ వ్యక్తి తాను పని చేసే ప్రాంతంలోనే ప్రాణాలు విడిచాడు. అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతదేహాంగా కనిపించాడు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం ఇందూరు సోలార్ ప్లాంట్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం మేరకు.. వివరాల్లోకి వెళ్ళితే పెద్దేముల్ మండల పరిధిలోని గోపాల్ పూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు, ఇందూర్ సోలార్ పవర్ ప్లాంట్ లో ఎలక్ట్రిషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి నైట్ డ్యూటీ ఉండటంతో విధులకు వచ్చాడు. అయితే తెల్లవారు శుక్రవారం సోలార్ పవర్ ప్లాంట్ లో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంభీకులు సమాచారం అందించారు. విషయం తెలుసున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్లాంట్ యజమాని వచ్చేంత వరకు మృతదేహాన్ని తీయలేదు. ఎలక్ట్రీషీయన్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సమగ్ర విచారణ తరువాత పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35398/