schedule Friday, September 04, 2026

సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల

calendar_today May 9, 2025
person dharshininews
సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల
సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల - సర్టిఫికెట్ల రెన్యూవల్ కోసం నేటి నుంచి స్లాట్ బుకింగ్స్ - ప్రకటించిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో మే నెలకు సంబంధించిన సదరం/యూడీఐడీ క్యాంపుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ షెడ్యూల్‌ను ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ క్యాంపులు జరుగుతాయని వెల్లడించారు. అంగవైక్యలం కోసం 13, 16, 21తేదిలలో క్యాంపులు, చెవుడు, మూగ కోసం 23, అంధులు, తక్కువ చూపు బాధితుల కోసం 27న, బుద్దమాంధ్యం, మానసిక వికలాంగత్వ బాధితుల కోసం 29న క్యాంపులు జరుగుతాయన్నారు. ఈ క్యాంపుల ద్వారా రెన్యూవల్ కోసం అవకాశం ఉంటుందని, ఈనెల 9(నేటి), 12వ తేదిలలో స్లాట్ బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని ఉంటే పైన తెలిపిన తేదిలలో క్యాంపులకు హాజరుకావాలని సూచించారు. [embed]https://www.dharshininews.com/35475/[/embed] ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35285/