schedule Monday, July 06, 2026

ఎమ్మెల్యే సహాకారంతో నీటి ఎద్దడికి చెక్..!

calendar_today May 14, 2025
person dharshininews
ఎమ్మెల్యే సహాకారంతో నీటి ఎద్దడికి చెక్..!
ఎమ్మెల్యే సహాకారంతో నీటి ఎద్దడికి చెక్..! - ప్రత్యేక చొరవతో వార్డులో బోరు ఏర్పాటు - పనులు ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో తాగునీటి ఎద్దడికి చెక్ పడుతోందని 25వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. బుధవారం 25వ వార్డులో ప్రజల తాగునీటి అవసరాల కోసం వార్డులో బోరు మోటారు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డులో బోరు మోటార్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వార్డులోని ప్రజల తాగునీటి ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారని చెప్పారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో బోరు మోటార్లను మంజూరు చేయించారని వెల్లడించారు. ఆయన సహాకారంతో వార్డులో మూడు కొత్త బోర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే సహాకారంతో పట్టణంలో తాగునీటి ఎద్దడి తీరుతోందని, వార్డు ప్రజల తరుపున ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35542/