schedule Monday, July 06, 2026

షరతుల్లేకుండా సబ్సీడీ రుణాలు ఇవ్వాలి

calendar_today May 16, 2025
person dharshininews
షరతుల్లేకుండా సబ్సీడీ రుణాలు ఇవ్వాలి
షరతుల్లేకుండా సబ్సీడీ రుణాలు ఇవ్వాలి - రాజీవ్ యువ వికాస్లో బ్యాంకర్ల జోక్యం తగదు. - అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న రాజీవ్ యువ వికాస్ పథకంలో ఎలాంటి షరతుల్లేకుండా సబ్సీడీ రుణాలు మంజూరు చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణలోని 5లక్షల మంది నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ ద్వారా రూ. 6కోట్ల రుణాలు అందజేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రంలోని సుమారు 16లక్షల 25వేల 441 మంది నిరుద్యోగులు నాలుగు కేటగిరిల్లో రుణాలకు దరఖాస్తులు చేసుకున్నారని వెల్లడించారు. మొదటి కేటగిరిలో 39,401, రెండో కేటగిరిలో 1లక్ష 93,023, మూడో కేటగిరిలో 49,434, నాలుగో కేటగిరిలో 12లక్షల 41,696 మంది రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నవారికి ఎలాంటి షరతల్లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణాల మంజూరులో బ్యాంకులు, స్థానిక నేతల జోక్యం లేకుండా అర్హులైన వారందరికి రుణాలు అందించాలన్నారు. ఎస్సీ, ఎసీ, బీసీ యువతకు రుణాలు అందించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. గత ప్రభుత్వం రుణాల మంజూరులో యువతకు అన్యాయం చేసిందని, అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత భవిష్యత్తుకు అండగా నిలించేందుకు రుణాలు మంజూరు చేసి తీరాలన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35566/