schedule Monday, July 06, 2026

భక్తిభావం అలవర్చుకోవాలి

calendar_today May 18, 2025
person dharshininews
భక్తిభావం అలవర్చుకోవాలి
భక్తిభావం అలవర్చుకోవాలి - భద్రేశ్వర రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ - అంతారం బసవేశ్వర విగ్రహవిష్కరణలో పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరు భక్తిభావం అలవర్చుకోవాలని తాండూరు భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు. ఆదివారం తాండూరు మండలం అంతారం గ్రామంలో గ్రామ యువకులు, గూళీ శివ కుమార్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో శివాలయంలో బసవేశ్వర విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి పటేల్ కిరణ్‌ కుమార్, దేవాలయ కమిటి సభ్యులతో కలిసి హాజరయ్యారు. దేవాలయంలో ప్రతిష్టించిన బసవేశ్వర విగ్రహానికి పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు, యువకులు, గూళీ కుటుంబ సభ్యులు పురాతన దేవాలయంలో బసవేశ్వర స్వామి విగ్రహావిష్కరణ చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు ఆద్యాత్మికతను అలవర్చుకుని భక్తి మార్గంలో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గూళీ శివకుమార్ స్వామి, పరమేశ్వర్ స్వామి, దేవాలయ కమిటి సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35600/