schedule Monday, July 06, 2026

వానోస్తే.. అశాంతే..!

calendar_today May 21, 2025
person dharshininews
వానోస్తే.. అశాంతే..!
వానోస్తే.. అశాంతే..! - శాంతినగర్ లో మళ్లీ నిలిచిన వర్షపు నీరు - రోడ్లపైకి వచ్చిన మురుగుతో తప్పని ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శాంతినగర్ లో వర్షపు నీరు నిలిచింది. వానోస్తే ఎప్పుడే అశాంతే అన్నట్లుగా మారింది. బుధవారం సాయంత్రం కురిసన వర్షంతో రోడ్డుపై మళ్లీ నీళ్లు నిలిచాయి. వర్షం పడిన ప్రతిసారి మార్గంలో వర్షపునీరు వరదలా ప్రవహిస్తోంది. దీంతో మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆటోలు, బైకులు, ఇతర వాహనాలు రాకపోకలకు ఆంటకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కాలనీలోని మురుగు కాలువలు నిండి మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. తాజాగా బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి కూడా రోడ్లపై వరద నీరు ప్రవహించింది. రోడ్లపై నీరు నిలవడంతో స్థానిక కాలనీ వాసులు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే రానున్న వర్షకాలంలో తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. శాంతినగర్ లో వర్షపు నీరు నిలవ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35634/