చిలుకవాగును వేగవంతంగా పూర్తి చేయండి
May 23, 2025
dharshininews
చిలుకవాగును వేగవంతంగా పూర్తి చేయండి
- తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- పార్టీ నేతలతో కలిసి పనుల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో చేపట్టిన చిలుక వాగు పనులను వేగవంతగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. శుక్రవారం సాయిపూర్ శివారులో నిర్మిస్తున్న చిలుక వాగు డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు.
నిర్మాణ పనులు ఏ దశలో జరుగుతున్నాయి..? ఏమైనా ఇబ్బందులు ఎదరవుతున్నాయా..? అని ఆరా తీశారు. అనంతరం చిలుకవాగు నిర్మాణ పనులను సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం చేపట్టాలని అన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని అన్నారు. పనులు వేగవంతం చేసి వర్షకాలంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దృష్టిసారించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, మార్కెట్ కమిటి డైరెక్టర్ తులసీ రాం, యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, యువ నాయకులు రాజు, జిలాని తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/35672/