schedule Thursday, September 10, 2026

నిరుద్యోగులారా.. తరలిరండి..!

calendar_today May 26, 2025
person dharshininews
నిరుద్యోగులారా.. తరలిరండి..!
నిరుద్యోగులారా.. తరలిరండి..! - బీఎంఆర్ మెగా జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలి - తాండూరు నియోజకవర్గ యువనాయకులు వికాష్ జోషి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ, యువతి యువకులు తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ యువనాయకులు వికాష్ జోషి కోరారు. ఈనెల 29న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌లో మెగా జాబ్‌ మేళా జరుగుతుందని తెలిపారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని అన్నార. తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) సహకారంతో దాదాపు 50 కంపెనీ నుంచి ప్రతినిధులు వారి కంపెనీలలోని ఉద్యోగాలకు ఇంటర్వూలు నిర్వహిస్తారని చెప్పారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదివిని అభ్యర్థులు అర్హులని తెలిపారు. 10వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని నిర్వహిస్తున్న జాబ్ మేళాకు యువకులు తమ బయోడేటా, పాస్‌ ఫోటో, దృవీకరణ పత్రాలు వెంట తీసుకరావాలని సూచించారు. బీఎంఆర్ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35724/